తెలంగాణలో మరో 197 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, January 24th, 2021, 11:01:44 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 29,560 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 197 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,93,253 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఒక్కరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పటి వరకూ ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణం గా తెలంగాణ రాష్ట్రం లో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,589 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 376 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,88,275 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 3,389 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.