దేశంలో భారీగా పెరిగిన కేసులు…మరో 197 మంది మృతి

Sunday, March 21st, 2021, 02:25:34 PM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. మళ్ళీ దేశం లో 40 వేలకు పైగా కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 11 లక్షల 33 వేలకు పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 43,846 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,15,99,130 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య భారీ గా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 197 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,59,755 కి చేరింది. నిన్న ఒక్క రోజే 22,956 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 1,11,30,288 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 3,09,087 కి చేరింది. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.