కరోనా అప్డేట్: తెలంగాణ లో మరో 1,967 కేసులు…9 మరణాలు

Sunday, September 27th, 2020, 09:24:38 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 1,967 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,85,833 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారీ నుండి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మరణాల తో, ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,100 కి చేరింది. కరోనా వైరస్ కి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో 2,058 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,54,499 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రం లో 83.13 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 30,234 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.