కరోనా అప్డేట్: తెలంగాణ లో మరో 1,949 కేసులు…10 మరణాలు

Sunday, October 4th, 2020, 09:23:23 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 51,623 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,949 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,99,276 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 10 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,163 కి చేరింది. తెలంగాణ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 2,366 మంది కరోనా వైరస్ భారి నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 1,70,212 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 27,901 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.