భారత్ లో మరో 15,590 కరోనా కేసులు…191 మరణాలు

Friday, January 15th, 2021, 01:24:36 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7,30,096 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 15,590 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి ఐదు లక్షల ఇరవై ఏడు వేలకు చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 191 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,51,918 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 15,975 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,01,62,738 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,13,027 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే రేపటి నుండి కరోనా వాక్సినేషన్ ప్రక్రియ మొదలు కానున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వాక్సిన్ పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.