భారత్ లో మరో 28,903 కేసులు…188 మరణాలు

Wednesday, March 17th, 2021, 11:00:30 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 9 లక్షల 69 వేల మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 28,903 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,14,38,734 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం నాడు 24 వేల వరకు కేసులు నమోదు కాగా,గత 24 గంటల్లో 28 వేలకు పైగా నమోదు కావడం ప్రజల్ని ఆందోళన కలిగిస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మళ్ళీ 200 కి చేరువ లో మృతుల సంఖ్య నమోదు అవుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 188 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,59,044 కి చేరింది. నిన్న ఒక్క రోజే 17,741 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోటి పది లక్షల మందికి పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2,34,406 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో పక్క దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.