తెలంగాణ లో మరో 1,863 కరోనా కేసులు

Saturday, August 15th, 2020, 10:37:02 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. నమోదు అవుతున్న కేసులతో ప్రజలు తీవ్ర భయాందోళన కి గురి అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 1,863 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 90,259 కి చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ భారిన పడి మరో 10 మంది ప్రాణాలను కోల్పోయారు.

తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 684 కి చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న ఒక్క రోజే 1,912 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 66,196 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రం లో 23,379 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.