తెలంగాణ లో మరో 181 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, March 12th, 2021, 11:45:41 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి తీవ్రత మళ్ళీ ఎక్కువగా ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 21,340 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 181 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,00,717 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరోక వ్యక్తి కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మృతి తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,650 కి చేరింది. నిన్న ఒక్క రోజే 163 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,97,195 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో మరో 1,872 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.