భారత్ లో మరో 15,144 కేసులు…181 మరణాలు

Sunday, January 17th, 2021, 01:32:24 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7,79,377 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 15,144 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,05,57,985 కి చేరింది. అయితే దీని తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 181 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మృతుల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,52,274 కి చేరింది. నిన్న ఒక్క రోజే 17,170 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,00,75,950 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,08,826 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే భారత్ లో నిన్నటి నుండి కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి రావడం సంతోషం కలిగించే అంశం అని చెప్పాలి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ వాక్సిన్ ల ఆమోదం, తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారు.