భారత్ లో భారీ గా పెరిగిన కరోనా కేసులు…మరో 172 మంది మృతి!

Thursday, March 18th, 2021, 10:30:38 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. నిన్న మొన్న 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో ముప్పై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో పది లక్షల అరవై మూడు వేలకు పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 35,871 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,14,74,605 కి చేరింది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 172 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,59,216 కి చేరింది. నిన్న ఒక్క రోజే 17,741 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,10,63,025 మంది భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం 2,52,364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.