కరోనా అప్డేట్: తెలంగాణ లో మరో 1,717 కేసులు

Sunday, October 11th, 2020, 09:27:04 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 46,657 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,717 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,12,063 కి చేరింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 5 గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మృతుల తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో 1,222 కి చేరింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 2,103 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 1,85,128 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 25,713 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.