17 మంది ఎంపీ లకు సోకిన కరోనా…అందులో తెలుగు ఎంపీ లు ఎంతమందో తెలుసా?

Monday, September 14th, 2020, 07:07:05 PM IST

భారత దేశం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ముందుగా ఢిల్లీ కి చేరుకున్న ఎంపీ లకు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 17 మంది కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.అయితే ఈ 17 మందిలో ఎక్కువగా 12 మంది బీజేపీ కి చెందిన వారే. మిగతా 5 గురిలో ఇద్దరు వైసీపీ కి చెందిన వారు కాగా, శివ సేన, డీ ఎం కే, ఆర్ ఎల్ పి ఎంపీ లు ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి భారిన పడ్డారు.

అయితే ముందుగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం తో వీరు సమావేశాలకు హాజరు కావడం కుదరలేదు. స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ హజరు కావడం కుదరలేదు. అయితే ఇందులో విశాఖ జిల్లా అరకు ఎంపీ మాధవి జ్వరంతో ఉండటం తో పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. చిత్తూరు జిల్లా కి చెందిన ఎంపీ రెడ్డప్ప కి సైతం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే అధికారులు వీరిని ఐశోలేశన్ లో ఉండాలి అని కోరడం జరిగింది.