భారత్ లో మరో 15,545 కేసులు…163 మరణాలు

Friday, January 22nd, 2021, 11:10:33 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 8,00,242 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 15,545 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,06,25,428 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి భారత్ లో వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 163 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,53,032 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 96.78 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో రెండు లక్షలకు దిగువనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.