భారత్ లో మరో 18,855 కేసులు…163 మరణాలు

Friday, January 29th, 2021, 12:02:36 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7,42,306 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 18,855 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,07,20,048 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో కరోనా పై ఉన్న ఆందోళన కొంతమేరకు తగ్గింది అని చెప్పాలి.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 163 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,54,010 కి చేరింది. నిన్న ఒక్క రోజే 20,746 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 1,03,94,352 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,71,686 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే భారత్ లో కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ 29,28,053 మందికి కరోనా వైరస్ టీకా ను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.