భారత్ లో తగ్గిన కరోనా కేసులు…మరో 161 మంది మృతి

Monday, January 11th, 2021, 10:58:47 AM IST

భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 6,59,209 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,311 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి నాలుగు లక్షల కంటే ఎక్కువే. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసులు కూడా ఇంకా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 161 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే రెండు వందల కంటే తక్కువ మరణాలు నమోదు కావడం తొలిసారి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,51,160 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,00,92,909 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,22,526 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.