తెలంగాణలో మరో 1,602 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, November 6th, 2020, 09:30:17 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత మెల్లగా మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,970 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,602 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,47,284 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా వాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,366 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. నిన్న ఒక్క రోజే 982 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,26,646 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 19,272 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.