తెలంగాణ లో మరో 1,579 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, October 21st, 2020, 08:25:55 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 41,475 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,579 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,26,124 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఎల్ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,287 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 1,811 మంది కరోనా వైరస్ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు తెలంగాణ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,04,388 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 20,449 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.