తెలంగాణలో మరో 1,554 కరోనా కేసులు

Friday, October 16th, 2020, 09:31:59 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 43,916 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,554 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,19,224 కి చేరింది. అయితే కరోనా వైరస్ కి ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరొక 7 గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,256 కి చేరింది. ఒక్క రోజులోనే 1,435 మంది కరోనా వైరస్ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,94,653 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 23,203 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.