భారత్ లో మరో 14,849 కేసులు…155 మరణాలు

Sunday, January 24th, 2021, 01:02:18 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. భారత్ లో కూడా ఇంకా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 7,81,752 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 14,849 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,06,54,533 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 155 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,53,339 కి చేరింది. నిన్న ఒక్క రోజే 15,948 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,03,16,786 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,84,408 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.