భారత్ లో తగ్గని కరోనా ఉధృతి…40 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

Friday, March 19th, 2021, 11:46:00 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి తీవ్రత ఏడాది దాటిన ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే భారత్ లో సైతం కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. నిన్నటి కంటే 11 శాతం పెరుగుదల తో 40 వేల వరకు కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 25 గంటల్లో 10,57,383 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 39,726 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి 15 లక్షలకు పైగా చేరింది.

అయితే ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 154 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,59,370 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 20,654 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలొ కోటి పది లక్షల మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2,71,282 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.