తెలంగాణలో మరో 1,539 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, November 5th, 2020, 10:05:33 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ 1,500 కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా నే ఉన్నా, మళ్ళీ కేసులు నమోదు అవ్వడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 44,327 శాంపిల్స్ ను పరీక్షించగా, అందులో 1,539 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,45,682 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ సోకి, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,362 కి చేరింది.

అయితే కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 979 మంది కరోనా వైరస్ నుండి కొలుకొగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో 2,25,664 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 18,656 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.