తెలంగాణ లో మరో 1,531 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, October 30th, 2020, 09:30:18 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 43,790 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,531 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,37,187 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో మృతి చెందిన వారి సంఖ్య 1,330 కి చేరింది.

కరోనా వైరస్ రికవరీ లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరొ 1,048 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,17,401 కు చేరింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 18,456 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.