తెలంగాణలో మరో 1,504 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, October 29th, 2020, 09:30:11 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 41,962 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,504 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,35,656 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే ఐదుగురు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,324 కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ భారీ నుండి 1,436 మంది కోలుకున్నారు. తాజాగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2,16,353 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ లో 17,979 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టి వ్ గా ఉన్నాయి.