భారత్ లో అదుపు తప్పుతున్న కరోనా…ఒక్కరోజే 1,501 మంది మృతి!

Sunday, April 18th, 2021, 11:54:41 AM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో పదిహేను లక్షల అరవై ఆరు వేల మందికి పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,61,500 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 1,47,88,109 కి చేరింది. అయితే ఈ మహమ్మారి విలయ తాండవం కి ప్రజలు అంతా తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. మరొక పక్క భారత్ లో కరోనా వైరస్ కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,501 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించిన సమయం నుండి మరణాల సంఖ్య ఇదే అత్యధికం అని చెప్పాలి. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,77,150 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,38,423 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,28,09,643 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 18,01,315 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ మహమ్మారి తీవ్రత మహారాష్ట్ర లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.