తెలంగాణలో మరో 1,481 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు..!

Wednesday, October 28th, 2020, 10:24:32 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,481 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,34,152 కి చేరింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరోమారు పెరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ కి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి తెలంగాణ రాష్ట్రం లో మృతి చెందిన వారి సంఖ్య 1,319 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,451 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకు 2,14,917 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 17,916 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.