తెలంగాణలో మరో 1,456 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు!

Thursday, October 22nd, 2020, 09:30:19 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,456 మందికి కరోనా వైరస్ సొకగా, తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ ఈ మహమ్మారి భారిన పడిన వారి సంఖ్య 2,27,580 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ కి వాక్సిన్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం తో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,292 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ లో తెలంగాణ రాష్ట్రం ముందంజ లో ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 1,717 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకు 2,06,105 మంది ఈ మహమ్మారి భారినుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ లో 20,183 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.