తెలంగాణలో మరో 1,432 కరోనా కేసులు

Thursday, October 15th, 2020, 09:02:52 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఎంత అప్రమత్తంగా ఉంటున్న పాజిటివ్ కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 38,895 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,432 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,17,670 కి చేరింది. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 8 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,249 కి చేరింది.

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 1,949 మంది కరోనా వైరస్ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,93,218 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 23,203 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం లో రికవరీ రేటు 88.76 శాతం ఉండటం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.