తెలంగాణ లో మరో 1,421 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Friday, October 23rd, 2020, 09:20:56 AM IST

తెలంగాణ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ నే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 38,484 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,421 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,29,001 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహా లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఆరుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,298 కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,221 మంది కరోనా వైరస్ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు 2,07,326 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో 20,337 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.