తెలంగాణ లో మరో 1,416 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, November 1st, 2020, 10:40:17 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం లో ఇంకా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,416 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,40,048 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,341 కి చేరుకుంది. అయితే కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 1,579 మంది కరోనా వైరస్ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,20,466 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 18,241 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.