బిగ్ న్యూస్: భారత్ లో మరో 17,921 కేసులు…133 మరణాలు

Wednesday, March 10th, 2021, 12:25:17 PM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7,63,081 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 17,921 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,12,62,707 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరొకసారి కరోనా వైరస్ మృతుల సంఖ్య వందని దాటింది. గడిచిన 24 గంటల్లో మరో 133 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,58,063 కి చేరింది. నిన్న ఒక్క రోజే 20,652 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే 20 వేలకు పైగా కరోనా వైరస్ నుండి కోలుకోవడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ఇప్పటి వరకూ భారత్ లో 1,09,20,046 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,84,598 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.