అమెరికా లో ఒక్క రోజులోనే లక్షా ఇరవై వేలకు పైగా కరోనా కేసులు..!

Saturday, November 7th, 2020, 03:00:45 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తన ఉగ్ర రూపం ను చూపిస్తోంది. అన్ని దేశాల్లో ప్రస్తుతం కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. లాక్ డౌన్, కరోనా నిబంధనల జాగ్రత్త చర్యల కారణంగా అదుపులో ఉందని భావించినా, మళ్ళీ చలి తీవ్రత పెరగడం తో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే అమెరికా లాంటి దేశాల్లో ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తోంది.శుక్రవారం రోజున అత్యధికంగా అమెరికా లో లక్షా 27 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా మూడో రోజు అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే ఇప్పటికే అమెరికా లో కోటి కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ మరణాల విషయం లో మొదటి స్థానం లో ఉన్నది. ఇప్పటి వరకు కూడా 2,36,000 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ సంఖ్యలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.