భారత్ లో మరో 13,052 కేసులు…127 మరణాలు

Sunday, January 31st, 2021, 12:38:08 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7,50,964 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 13,052 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,07,46,183 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. మరో పక్క దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోంది.

అయితే కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 127 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మృతుల తో కలిపి మొత్తం భారత్ లి ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,54,274 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 13,965 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,04,23,125 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,68,784 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.