భారత్ లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా…మరో 126 మంది మృతి!

Thursday, March 11th, 2021, 12:22:54 PM IST

india_corona

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే మళ్ళీ రెండు నెలల గరిష్ఠానికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 7,78,416 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 22,854 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,12,85,561 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను మరింత ఆందోళన కి గురి చేస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 126 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,58,189 కి చేరింది. నిన్న ఒక్క రోజే 18,100 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,09,38,146 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,89,226 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా వేగవంతం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.