భారత్ లో ఆగని కరోనా కేసులు… మరో 1,247 మంది మృతి!

Saturday, September 19th, 2020, 12:31:15 PM IST

india_corona

ప్రపంచ దేశాలను భయ పెడుతున్న కరోనా వైరస్ మహమ్మారి, భారత్ లో కూడా ఎక్కువగా నే ఉంది. ప్రతి రోజూ 90 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, పరిస్థతిమరింత ఆందోళనకరంగా మారింది. అయితే గడిచిన 24 గంటల్లో 8,81,911 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 93,337 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 53,08,014 కి చేరింది.

భారత్ లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 1,247 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 85,619 కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు ప్రస్తుతం 1.62 గా ఉంది. అయితే కరోనా వైరస్ మరణాల తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.

అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం భారత్ లో 79.28 శాతంగా కరోనా వైరస్ రికవరీ రేటు ఉంది. గడిచిన 24 గంటల్లో 95 వేలమందికి పైగా కరోనా వైరస్ భారీ నుండి క కోలుకోగా, ఇప్పటి వరకూ ఈ మహమ్మారి భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 42,08,432 కి చేరింది. అయితే భారత్ లో ప్రస్తుతం 10,13,965 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.