ఢిల్లీ లో ఒకేరోజు 121 మంది కరోనా తో మృతి

Tuesday, November 24th, 2020, 10:09:10 AM IST

Corona

దేశం లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం తో కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అదే తరహాలో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దేశ రాజధాని లో ఈ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 37,307 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 4,454 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఢిల్లీ లో ఇప్పటి వరకు 5.34 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది.

అయితే కరోనా వైరస్ మృతుల సంఖ్య ఢిల్లీ లో రోజు రోజుకి పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో మరో 121 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మరణాల తో మొత్తం ఢిల్లీ లో ఇప్పటి వరకు 8,512 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు 4,88,476 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లో 37,327 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.