తెలంగాణ లో మరో 1,196 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, November 11th, 2020, 09:22:32 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 44,635 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,196 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,53,651 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఐదుగురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,390 కి చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 1,745 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,34,234 కి చేరింది. ప్రస్త తెలంగాణ రాష్ట్రం లో 18,027 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.