భారత్ లో మరో 26,291 కేసులు…118 మరణాలు

Monday, March 15th, 2021, 10:53:27 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. మళ్ళీ భారత్ లో 20 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా చేసిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో 26,291 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,13,85,339 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఆందోళన కి గురి చేస్తోంది.

అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉండటం తో మృతుల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 118 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,58,725 కి చేరింది. నిన్న ఒక్క రోజే 17,455 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,10,07,352 కి చేరింది. అయితే భారత్ లో ఇంకా 2,19,262 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.