తెలంగాణలో మరో 116 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, March 1st, 2021, 10:20:27 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 20,375 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 116 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,98,923 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాక దేశ వ్యాప్తంగా నేటి నుండి రెండవ దశ కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. 60 ఏళ్లకు పై బడిన వారికి, 45 ఏళ్ల వయస్సు నుండి 59 ఏళ్ల వయస్సు కలిగి ఉండి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ వాక్సిన్ నేటి నుండి వేయనున్నారు. అందుకోసం ప్రత్యేక వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏ ఒక్కరూ కూడా మృతి చెందలేదు. గడిచిన 24 గంటల్లో మరో 165 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో 2,95,387 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 1,902 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.