ఏపీ లో భారీగా తగ్గిన కేసులు… సున్నా మరణాలు!

Sunday, January 31st, 2021, 10:37:58 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత మెల్లగా తగ్గుముఖం పడుతుంది. అయితే దీని తీవ్రత ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,910 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 116 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,87,836 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది.

అయితే గడిచిన 24 గంటల్లో సున్నా మరణాలు నమోదు అయ్యాయి. అయితే కరోనా వైరస్ కి తీసుకుంటున్న చర్యల కారణంగా దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ 7,153 మంది ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 127 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రం లో 8,79,405 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,278 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా అమలు చేస్తుండటం తో ఈ మహమ్మారి ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి.