బిగ్ న్యూస్: దేశంలో పెరుగుతున్న కరోనా తీవ్రత…మరో 113 మంది మృతి!

Sunday, February 28th, 2021, 11:00:44 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 7 లక్షల 95 వేలకు పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,752 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే గత నాలుగు రోజుల నుండి 16 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,10,96,731 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను ఆందోళనకి గురి చేస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేయడం, సడలింపుల తో పాటుగా, యధావిధిగా ప్రజా జీవనం మొదలు కావడం తో మళ్ళీ ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే ఒక పక్క ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం మాత్రమే కాకుండా, వాక్సినేషన్ ప్రక్రియ రెండవ దశ వేగవంతంగా కొనసాగుతూనే ఉంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 113 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,57,051 కి చేరింది. నిన్న ఒక్క రోజే 11,718 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,07,75,169 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 1,64,511 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.