బిగ్ న్యూస్: దేశంలో 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు!

Sunday, September 27th, 2020, 10:24:43 AM IST

india_corona

భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. భారీగా కేసులు నమోదు అవుతుండటంతో వందల సంఖ్యలో బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో 9,87,861 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 88,600 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి, మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 59,92,533 కి చేరింది. భారత్ లో 60 లక్షల పాజిటివ్ కేసులకి చేరువ లో ఉండటం చాలా ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో 1,124 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి భారత్ లో మృతి చెందిన వారి సంఖ్య 94,503 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 92 వేలకు పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 49,41,628 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 9,56,402 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.