భారత్ లో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు…ఒక్కరోజే 1,114 మంది మృతి

Sunday, September 13th, 2020, 11:55:54 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతూ ప్రజలను మరింత భయాందోళన కి గురి చేస్తోంది. అయితే తాజాగా మరో 94,371 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47,54,356 కి చేరింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే ఈ పాజిటివ్ కేసుల్లో ఇప్పటి వరకూ కూడా 37 లక్షల మందికి పైగా కొలుకోగా, ప్రస్తుతం 9 లక్షల 73 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 78 వేల మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నట్లు తెలుస్తోంది. అదే తరహాలో గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 1,114 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో భారత్ లో కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 78,586 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.