ఏపీ లో మరో 111 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Wednesday, January 27th, 2021, 06:02:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 33,808 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 111 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,84,454 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 7,152 కి చేరింది. నిన్న ఒక్క రోజే 97 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 8,75,933 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,369 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.