బిగ్ న్యూస్: ఏపీ లో భారీ గా నమోదు అయిన కరోనా కేసులు..!

Wednesday, August 26th, 2020, 09:54:45 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 61,838 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 10,830 కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,79,574 కి చేరింది. అయితే అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 81 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,541 కి చేరింది.

అయితే ఏపీ లో కరోనా రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,473 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోవడం జరిగింది. అయితే మొత్తం ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 2,83,825 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 92,208 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.