భారత్ లో మరో 12,923 కేసులు…108 మరణాలు

Thursday, February 11th, 2021, 11:12:24 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 6,99,185 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 12,923 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి ఎనిమిది లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 108 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,55,360 కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పాలి. ఇప్పటి వరకూ కోటి ఐదు లక్షలకు పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,42,562 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.