బిగ్ న్యూస్: మళ్లీ ఏపీ లో భారీగా కరోనా కేసులు…70 మంది మృతి!

Sunday, September 6th, 2020, 08:31:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది కానీ, తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 10,794 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 72,573 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 10,794 పాజిటివ్ గా తేలాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకు 4,95,230 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ భారిన పడి 70 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,417 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు ఎక్కువగా ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 11,915 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,91,124 కి చేరింది.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా, రికవరీ రేటు కూడా పెరగడం భారీ ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 99,689 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.