కరోనా అప్డేట్: ఏపీ లో మళ్లీ పెరిగిన కేసులు…ఒక్కరోజే 76 మంది మృతి

Friday, September 4th, 2020, 08:53:28 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,776 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,76,506 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 76 మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ 4,276 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నా, రికవరీ రేటు ఎక్కువగా ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 12,334 మంది కరోనా వైరస్ భారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా సోకి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,67,268 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,02,067 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.