భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు…ఒక్క రోజే 1,065 మంది మృతి

Sunday, September 6th, 2020, 11:51:18 AM IST

india_corona

భారత దేశం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచం లోనే ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో మొదటి స్థానం లో ఉంది. గడిచిన 24 గంటల్లో 90,632 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే భారత్ లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతేకాక ఇన్ని కేసులు ఎక్కడా కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. తాజాగా నమోదు అయిన ఈ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 41 లక్షలకు పైగా చేరింది. మొత్తం 41,13,811 కి చేరింది.

అయితే కరోనా వైరస్ మహమ్మారి రికవరీ రేటు సైతం భారత్ లో ఎక్కువగానే ఉంది. నిన్న ఒక్క రోజే 73 వేల మంది ఈ మహమ్మారి భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 31 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం 8 లక్షల వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 77 శాతానికి పైగా ఉండటం భారీ ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.

అయితే భారత్ లో కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య దేశం లో క్రమం గా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 1,065 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య భారత్ లో 70,626 కి చేరింది. కరోనా మరణాల్లో భారత్ ప్రస్తుతం మూడవ స్థానం లో ఉన్నది. అయితే కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువగా చేస్తుండటం చేత పాజిటివ్ కేసులు భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.