ఏపీ లో మళ్లీ భారీగా పెరిగిన కేసులు…మరణాలు

Thursday, August 27th, 2020, 05:52:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీ లో రోజుకి పది వేలకు పైగా కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరో 10,621 కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు కాగా, ఇప్పటి వరకు 3,90,195 మందికి కరోనా వైరస్ సోకింది. అదే తరహాలో గడిచిన 24 గంటల్లో 92 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకూ 3,633 మంది ప్రాణాలను కోల్పోయారు.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,528 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 2,92,353 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 94,209 కరోనా వైరస్ పాజిటివ్ కేసుల యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.