బిగ్ న్యూస్: ఏపీ లో మళ్లీ భారీగా కరోనా కేసులు…మరణాలు!

Sunday, August 30th, 2020, 10:00:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,603 మంది కరోనా వైరస్ భారిన పడగా, ఇప్పటి వరకూ 4,21,872 మందికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకింది. అయితే ఈ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 88 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మరణించిన వారితో కలిపి మొత్తం రాష్ట్రం లో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 3,884 కి చేరింది.

అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 9,067 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 3,18,859 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 99,129 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంకా వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసులతో పాటుగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రజలు కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.